పెన్ష‌న‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త ..

న్యూఢిల్లీ: దేశంలోని సుమారు 50 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు,61ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్ప‌నుంది. ఇప్పుడు ఉన్న 28శాతం ద్ర‌వ్యోల్బ‌ణానికి అనుగుణంగా క‌ర‌వు భ‌త్యం (డీఏ) ,డియ‌ర్‌నెస్‌రిలీప్ (డీఆర్‌) ల‌ను పెంచేందుకు నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం , డీఏను 17 నుంచి 21 శాతానికి అంటే 4శాతం పెంచేందుకు నిర్ణ‌యించింది. జ‌న‌వ‌రి నుంచి ఇది వర్తించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ అధికారికంగా మాత్రం దీనిపై ప్ర‌భుత్వం ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న కోసం కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాఖ్య ఇటీవ‌ల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ను క‌లిసి, ప్ర‌భుత్వ ఖ‌జానా ఇప్పుడు ప‌రిస్థితిని వివ‌రించి, ఇప్పుడు ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌కారం ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు డీఏ ఇవ్వాల‌ని కోరారు. కోవిడ్ సంక్షోభం కార‌ణంగా 2021 జూలై వ‌ర‌కూ ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల డీఏలో ఇంక్రిమెంట్ నిలిపివేయాల‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ గ‌త ఏప్రిల్ 2020న నిర్ణ‌యించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *