కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను అలాగే ఉంచాలి-ఆర్భీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్

న్యూఢిల్లీ: పోయిన ఏడాది కరోనా మ‌మ్మాహ‌రి కారణంగా కుదేలైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిలో పెట్ట‌డానికి గ‌త మార్చి త‌రువాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు త‌గ్గించింది. చివ‌రిసారి గ‌త సంవ‌త్స‌రం మే22 రెపో రేటును త‌గ్గించిన రిజర్వ్‌బ్యాంక్‌..అప్ప‌టి నుంచీ ఎలాంటి మార్ప‌లు చేయ‌డం లేదు. కేంద్ర బ‌డ్జెట్ త‌రువాత జ‌రిగిన తొలి మానిట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) స‌మావేశంలో కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను అలాగే ఉంచాల‌ని నిర్ణ‌యించారు. దీంతో రెపోరేటు 4శాతంగా, రివ‌ర్స్ రెపోరేటు 3.35 శాతంగా కొన‌సాగ‌నుంది. ఎంపీసీ మీటింగ్ తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్భీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ సంగ‌తిన్ని వెల్ల‌డించారు.రెపోరేటు అంటే బ్యాకుల‌కు ఆర్బీఐ ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే వ‌డ్డీ శాతం. ఇక రివ‌ర్స్ రెపో అంటే బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకున్న రుణాల‌పై ఇచ్చే వ‌డ్డీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *