దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కోళ్ల దిగుమ‌తిపై నిషేదం…

న్యూఢిల్లీః దేశంలో బ‌ర్డ్ ప్లూ వైర‌స్ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం విధించారు. ఇటీవ‌ల అక్క‌డ వ‌రుస‌గా ప‌క్షులు మృత్యువాత ప‌డుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ వెల్ల‌డించారు. అదేవిధంగా ఘూజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ను మ‌రో 10రోజులపాటు మూసే ఉంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. చ‌నిపోయిన కోళ్ల నుంచి కొన్ని శాంపిల్స్ తీసి జ‌లంధ‌ర్‌లోని ల్యాబ్‌కు పంపించామ‌ని, సోమ‌వారం రిపోర్టులు వ‌స్తాయ‌ని కేజ్రివాల్ చెప్పారు. ఈ రిపోర్టుల ఆధారంగా ప్ర‌భుత్వం ఢిల్లీలో త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డుతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *