పేద ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ – ప్ర‌తి ఒక్క‌రికి ఉచితంగా రేష‌న్ బియ్యం

హైద‌రాబాద్‌: ఇప్పుడు యావ‌త్తు ప్ర‌పంచము మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో ప్ర‌జ‌లు అనేక ర‌కాల స‌మ‌స్య‌లతో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని తెలిసిన సంగ‌తే, దీనికి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్ర‌భుత్వం పేద‌ల‌ను ఆదుకోవాల‌ని ఉద్దేశంతో ఉపాధి కోల్పోయిన నిరుపేద‌ల కుటుంబాల‌కు ఆస‌రాగా నిలుస్తుంది.కూలీనాలీ చేస్తుకున్న పేద‌ల‌కు జూన్ నెల‌కు 15 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల‌ని తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.జూన్ నెల రేష‌న్‌లో కేంద్ర స‌ర్కారు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మలాక‌ర్ ప్ర‌క‌ట‌న చేశారు.జూన్ నెల రేష‌న్ లో కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించిన‌53 ల‌క్ష‌ల 56 వేల కార్డుల‌కు అందించే ప‌దిహేను కిలోల‌కు తోడు రాష్ట్ర స‌ర్కారు 33ల‌క్ష‌ల 86వేల కార్డుదారుల‌కు ఎలాంటి ప‌రిమితి లేకుండా ప‌దిహేను కిలోలు ఉచితంగా అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని మంత్రి తెలిపారు. అంత్యోద‌య అన్న‌యోజ‌న కార్డుదారుల‌కు 35కేజీల‌కు అద‌నంగా మ‌రో ప‌ది కిలోల్ని, అన్న‌పూర్ణ కార్డుదారుల‌కు ప‌దికిలోల‌కు అద‌నంగా మ‌రో ప‌దికిలోల్ని అందించ‌నుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రాష్ట్రంలోని 2 కోట్ల 79 ల‌క్ష‌ల 24 వేల 300 మందికి ల‌బ్ది చేకూర‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *