పేస‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా మ‌రో అరుదైన రికార్డు…

మెల్ బోర్న్ః టీమ్ ఇండియా పేస‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా మ‌రో అరుదైన ఫీట్ అందుకున్నాడు.మెల్ బోర్న్ క్రికెట్ గ్రాండ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. రెండో టెస్టులో బుమ్రా ఆరు వికెట్ల‌తో చెల‌రేగాడు. మెల్‌బోర్న్ లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన భార‌త లెజండ‌రీ లెగ్‌స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే రికార్డును బుమ్రా స‌మం చేశాడు. కుంబ్లే క‌న్నా వేగంగా బుమ్రా ఈ ఘ‌న‌త సాధించాడు. త‌న మూడో ఆసీస‌ఖ ప‌ర్య‌ట‌న‌లో బాక్సింగ్ డే టెస్టులో కుంబ్లే (6 ఇన్నింగ్స్‌లు) 15 వికెట్లు తీయ‌గా బుమ్రా (4 ఇన్నింగ్స్‌లు) రెండో టూర్‌లోనే అన్నే వికెట్లు తీసి రికార్డును స‌మం చేశాడు. దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌పిల్‌దేవ్ ఇదే గ్రౌండ్‌లో 6ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు ప‌డ‌గొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *