టీమిండియాదే పైచేయి….

మెల్ బోర్న్ః తొలిటెస్ట్‌లో ఘోరా ప‌రాభ‌వం త‌రువాత బాక్సింగ్ డే టెస్ట్‌లో అద్భుతంగా పుంజుకుంది. టీమిండియా అజింక్య ర‌హానే కెప్టెన్ ఇన్నింగ్స్ టెస్టులో 12వ సెంచ‌రీ చేయ‌గా..అత‌నికి ఆల‌రౌండ‌ర్ జ‌డేజా చ‌క్క‌ని స‌హాకారం అందించ‌డంతో క్ర‌మంగా మ్యాచ్‌పై ప‌ట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌కు 277 ప‌రుగులు చేసి 82 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది. ర‌హానే 104,జ‌డేజా40 ప‌రుగులు చేసి నాటౌట్ నిలిచారు. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఆరో వికెట్కు అజేయంగా 104 ప‌రుగులు జోడించారు. వికెట్ న‌ష్టానికి 36 ప‌రుగుల‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియా వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్ మ‌న్‌గిల్45 ప‌రుగులు చేసి ఔట‌వ‌గా …పూజారా 17 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో టీమిండియా 64 ప‌రుగుల కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో ర‌హానే అద్భుతంగా పోరాడాడు. మొద‌ట విహారీ(21) తో క‌లిసి నాలుగో వికెట్కు 52 ప‌రుగులు … తరువాత వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (29) తో క‌లిసి ఐదో వికెట్కు57 ప‌రుగులు జోడించాడు. 173
ప‌రుగుల ద‌గ్గ‌ర ఐదో వికెట్గా పంత్ ఔట‌వ‌డంతో … టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆధిక్యం ల‌భి
స్తుందా అన్న అనుమానం క‌లిగింది.ఈ స‌మ‌యంలో ర‌హానేతో జ‌త క‌ట్టిన జ‌డేజా త‌న అద్భుత‌మైన ఫామ్ కొన‌సాగించాడు.టీ20 మ్యాచ్‌లోగాయం కార‌ణంగా రెండు టీ20లు, తొలి టెస్ట్‌కు దూర‌మైన జ‌డేజా… ఆసీస్‌బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. అస‌లుసిస‌లు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ..ర‌హానేకు చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. దీంతో ఇండియ‌న్ టీమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన ఆధిక్యం ల‌భించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి జ‌డేజా 104 బంతుల్లో 40 ప‌రుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *