నీ విలువ తెలిసింది.. అందుకే వంగిమొక్కుతున్నా….

హైద‌రాబాద్‌:దేశంలో 2020 లో క‌రోనా వ‌ల‌న అనేక‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్ర‌జ‌లు కొంత‌మంది మాత్రం ఆర్థిక ప‌రిస్థితులు త‌ట్టుకోలేక ప‌ట్ట‌ణం విడిచి ప‌ల్లెబాట ప‌ట్టారు. కొంత‌మంది ఆక‌లి చావుల‌తో మర‌ణించారు.ఇలా అనేక స‌మ‌స్య‌ల‌తో జ‌నం నానా అగ‌చాట్లు ప‌డ్డారు. డాక్ట‌ర్ల ప‌రిస్థితి మ‌రి ఘోరంగా అని చెప్పాలి. వాళ్లు 24 గంట‌లు ప్ర‌జ‌లకు సేవాచేశారు. కొంత‌మంది డాక్ట‌ర్ల ప్రాణాలను కోల్పోయారు అయిన వారి సేవా అగిపోలేదు.ఇలా అనేక రంగాల చెందినప్ర‌ముఖులు దేశా ప్ర‌జ‌ల‌కు ఏదోఒక్క‌విధంగా ఆర్థిక స‌హాయం చేశారు. క‌రోనా మమాహ్మ‌రి వ‌ల‌న రోడ్డు ర‌వాణా వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించింది.ఒక మ‌నిషి విలువైన లేదా ఒక వస్తువు విలువైన అది లేక‌న‌ప్పుడే తెలుస్తుంది అనేది వాస్త‌వం.లాక్‌డౌన్ దేశాప్ర‌జ‌ల‌కు ఎన్నో అనుభ‌వాలను,గుణ‌పాఠాల‌ను నేర్పింది..క‌రోనా వ‌చ్చిన త‌రువాత దేశంలో రవాణ వ్య‌వ‌స్త‌పై త్రీవ ప్ర‌భావం ప‌డింది.కొవిడ్ కార‌ణంగా విధించి లాక్‌డౌన్ సామాన్య ర‌వాణ బ‌స్సులు, రైళ్లు తిర‌గ‌డం ఆగిపోయాయి.భార‌త‌దేశంలో ప్ర‌జా ర‌వాణ ఖ‌ర్చు అయ్యేది రైళ్లలో అనే విష‌యం ప్ర‌త్యేక చెప్ప‌క్క‌లేదు. అటువంటి ఇప్ప‌టికి దేశంలోనూ…వివిధ రాష్ట్రాల పూర్తిగా అందుబాటులోకి రాలేదు.ప్ర‌స్తుతం కాస్త క‌రోనా నుంచి దేశం కోలుకోగా.. ఇప్ప‌డిప్పుడే రైళ్లు, లోక‌ల్ రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కూడా 11 నెల‌ల త‌రువాత ముంబైలో లోక‌ల్ ట్రైన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో ఎమోష‌న‌ల్ అయిన ఓ యువ‌కుడు విరామం త‌రువాత లోక‌ల్ ట్రైన్ ఎక్కుతూ త‌ల‌వంచి దండం పెడుతున్న ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడయాలో వైర‌ల్ అయ్యింది. క‌రోనా కార‌ణంగా లోక‌ల్ ట్రైన్లు ర‌ద్దు కావ‌డంతో సామాన్యుడి జీవితం ముంబైలో ఛిద్రం అవ‌గా.. లోక‌ల్ ట్రైన్ మొద‌లు కావ‌డంతో నీ విలువ తెలిసింది. అందుకే మొక్కుతున్నా అన్న‌ట్లుగా ఆఫోటో ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌హీంద్రా గ్రుప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా కూడా ఈఫోటోను షేర్ చేసి సోల్ఆఫ్ ఇండియా అని కామెంట్ చేశారు. మార్చి 2020లో క‌రోనా మ‌మ్మాహ‌రి వ్యాప్తి చెందిన స‌మ‌యం నుంచి స్థానిక రైళ్ల ప్ర‌యాణం ఆగిపోయింది. ముంబై మ‌రియు చుట్టుప‌క్క‌ల ప‌ట్ట‌ణాల్లో నివ‌సిస్తున్న ల‌క్ష‌లాది మంది రైళ్లు ఆగిపోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. చాలా మంది ఉపాధి కూడా ప్ర‌భావం అయ్యింది. సిటీ లైఫ్‌లో సాధార‌ణ జీవితం గ‌డిపే ఎంతోమంది లోక‌ల్ ట్రైన్‌లో తిరుగుతారు అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఫిబ్ర‌వ‌రి 1తేదీ నుంచి ముంబై రైళ్లు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *