ఆర్బీఐ,ఎన్‌బీఎఫ్ సీ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉన్న‌సంస్థ‌ల ద‌గ్గ‌రే రుణాలు తీసుకోవాలి…

*లోన్ యాప్స్‌ వేధింపులు ఇక్కడ ఫిర్యాదు చేయాలన్న ఆర్బీఐ* *కొంతకాలంగా లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించిన ఉదంతాలు అనేక వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీటి వేధింపులు తట్టుకోలేక తెలంగాణలో కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. ఇప్పటికే ఇలాంటి యాప్స్ ప్రతినిధుల వేధింపులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించగా. తాజాగా దీనిపై ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలకు లోబడి ఉన్న సంస్థల దగ్గరే రుణాలు తీసుకోవాలని సూచించింది.* *కొన్ని యాప్స్ అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్టు తమకు తెలిసిందన్న ఆర్బీఐ. సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌ల మాయలో పడొద్దని సూచించింది. లోన్ యాప్స్‌ కోసం వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంది. ఇక ఈ తరహా యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *