బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో 15మంది అరెస్టు…

హైద‌రాబాద్‌: బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో అరెస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతున్న‌ది. ఆదివారం మ‌రో 15 మంది నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంబంధ‌మున్న విజ‌య‌వాడకు చెందిన సిద్దార్థ‌తోపాటు మ‌రో 14మంది అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించి కిడ్నాప్‌కు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసిందే. కేసులో ప్ర‌ధాన నిందితులైన భార్గ‌వ్‌రామ్‌, గుంటూర్ శ్రీ‌ను, జ‌గ‌త్ విఖ్యాత్‌రెడ్డి,కిర‌ణ్మ‌యి, చంద్ర‌హాస్ ఇంకా ప‌రారీలోనే ఉన్నారు. వీరికోసం పోలీసులు ప‌లు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ప్ర‌వీణ్‌రావు సోద‌రుల కిడ్నాప్ కేసులో ఏ-1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. ఏ-2 ఏవీ సుబ్బారెడ్డిని, ఏ-3 గా అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్ రామ్‌ను చేర్చారు. హాఫిజ్ పేట భూముల విష‌యంలో ప్ర‌వీణ్‌రావు సోద‌రుల కిడ్నాప్‌కు ప్లాన్ చేసిన‌ట్టుగా పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *