అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రావ‌దు.- కిష‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌: ప్ర‌స్తుతం దేశం యావ‌త్తు క‌రోనా తో త‌ల్ల‌డిల్లుతుంది.ప్ర‌జ‌లు నానాఅవ‌స్థులు ప‌డుతున్నారు, ఇలాంటి త‌రుణంలో క‌రోనా మ‌హ‌మ్మారితో కుటుంబాలు చిన్న‌భిన్న‌మైన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ‌స‌భ్యుల‌ను దూరం చేసుకొవ‌డం, దుఃఖ సాగ‌రం అయింది.దేశంలో ఎక్క‌డైన క‌రోనాతో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల బాధ్య‌త కేంద్ర స‌ర్కారు తీసుకుటుంద‌ని కేంద్ర హోంశాఖా స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. వారికి చ‌దువు, ఆరోగ్యానికి అయ్యే ఖ‌ర్చు అంతా కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. సేవా హీ సంఘ‌ట‌న‌లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఆశా వ‌ర్క‌ర్లు, జీహెచ్ఎంసీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కిష‌న్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ నేప‌థ్యంగా కిష‌న్‌రెడ్డి ముచ్చ‌టిస్తూ.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ 7 ఏడేళ్ల పాల‌న అవుతున్న త‌రుణంలో దేశవ్యాప్తంగా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. వారం రోజుల పాటు బియ్యం, నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. కొవిడ్‌తో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని.. క‌నిపించ‌ని శ‌త్రువుతో ప్ర‌జలు పోరాటం చేస్తున్నార‌న్నారు. క‌రోనా కట్ట‌డికి కావ‌ల‌సిన అన్ని చ‌ర్య‌లు కేంద్రం చేప‌ట్టింద‌ని చెప్పారు. 11 కంపెనీలో బ్లాక్ ఫంగ‌స్‌కు కావాల్సిన ఇంజెక్ష‌న్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని అన్నారు.డిసెంబ‌ర్ నాటికి అంద‌రికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని తెలిపారు. టీకాలు అందే వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్నారు. విద్యార్థుల మ‌ధ్యాహ్నం భోజ‌నం ప‌తాకానికి అయ్యే ఖ‌ర్చు వారి ఖాతాలో జ‌మ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంద‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *