ఎక్క‌డా వ్యాక్సిన్ లోటు లేదు- కిష‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌: గ‌త ఏడాది నుండి కొవిడ్ మ‌హ‌మ్మారి విలాయ‌తాడ‌వం చేస్తోందని విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల త‌గ్గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి కోరారు. హైదార‌బాద్ గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శించిన ఆయ‌న క‌రోనా వ్యాక్సిన్ , చికిత్సా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. ఈ నేప‌థ్యంగా కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ…. దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా సాగుతోంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు అంద‌రూ వ్యాక్సిన్స్ తీసుకోవాల‌ని తెలిపారు. టీకా వేయించుకున్న వారు నిర్ల‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌న్న కిష‌న్‌రెడ్డి టీకా ఉత్స‌వ్‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావాల‌ని తెలిపారు. ఎక్క‌డా వ్యాక్సిన్ లోటు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని,దేశంలో రెండు సంస్థ‌లు వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేస్తున్నాయ‌న్నారు.మ‌న‌దేశంలో పాటు మ‌రో 58 దేశాల‌కు ఇండియా నుంచి వాక్సిన్ స‌ర‌ఫ‌రా అవుతోంద‌ని ముందుగా మ‌న‌దేశప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించేందుకు అవ‌కాశం ఉన్న‌న్ని డోసులు అందుబాటులో ఉంచుతున్నాం. ప్ర‌ధాని కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. నేను కొవిషీల్డ్ టీకా తీసుకున్నాను. ఏ వ్యాక్సిన్ అయినా మంచిగానే ప‌నిచేస్తోంది. ప్ర‌భుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉచితంగా అందదిస్తున్నారు. ప్ర‌త్యేకంగా వ్యాక్సిన్ కేంద్రాన్ని గాంధీలో ఏర్పాటు చేశారు. కొవిడ్ రోగుల‌తో క‌లిసే అవ‌కాశం లేకుండా ఆసుప‌త్రి వార్డుల‌కు కొంత దూరంగా ఉండేలా కేంద్రం ఏర్పాటు చేశారు. ఎక్క‌డా వ్యాక్సిన్ లోటు లేదు. అని కిష‌న్‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *