న‌డిరోడ్డు పై ఇంత ఘోర‌మా -బండిస‌జ‌య్‌కుమార్‌

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో గుండా రాజ‌కీయాన్ని పెంచి పోషిస్తున్నారు. అవినీతిని ప్ర‌శ్నిస్తున్నందుకే ఆయ‌న‌పై హత్య చేసి చంపేశారు అని బండి సంజ‌య్ అన్నారు. న‌డిరోడ్డుపై న్యాయ‌వాది దంపతుల‌ను హ‌త్య చేయ‌డం దుర్మార్గం ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌కు ప్రాణహాని ఉంద‌ని హైకోర్టుకు తెలిపారు. వామ‌న్‌రావు హ‌త్య‌పై హైకోర్టు సుమోటోగా కేసు స్వీక‌రించి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్టింగ్ జ‌డ్డితో ప్ర‌త్యేక విచార‌ణ చేయాలి. .. ఒక మ‌హిళ అని కూడా చూడ‌కుండా దార‌ణంగా హ‌త్య చేశారు. కనీసం హ‌త్య‌పై స్పందించాల్సిన మాన‌వ‌త్వం కూడా ముఖ్య‌మంత్రికి లేదా? అని ప్ర‌శ్నించారు సంజ‌య్‌.వామ‌న్‌రావు హ‌త్య ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్య‌నే. హ‌త్య వెనుక పెద్ద పెద్ద నేత‌ల హ‌స్తం ఉంది. రాష్ట్రంలో అస‌లు హోం మినిస్ట‌ర్ ఉన్నాడా? టీఆర్ఎస్ పార్టీ నేత‌లే హ‌త్య చేశారు కాబ‌ట్టి.. టీఆర్ఎస్ నేత‌లు స్పందించ‌డంలేదు. అని బండి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *