మ‌న‌దేశం కొవిడ్ కేసులు వ‌ర‌ల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

హైద‌రాబాద్‌: ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల్లో మ‌న‌దేశం వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో గ‌త 24 గంట‌ల్లో 3.14ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌పంచంలోనే ఒకే రోజు ఇన్ని కేసులు ఓ దేశంలో న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.దీంతో భార‌దేశం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.59కోట్ల‌కు చేరింది. కొవిడ్ సెకండ్ వేవ్‌… ఇండియాలో పెను స‌వాళ్ల‌ను విసిరింది. ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ అంద‌క అనేక‌మంది అసువులుబాస్తున్నారు. యాంటీవైర‌ల్ డ్ర‌గ్ రెమిడిసివిర్‌కు భారీ డిమాండ్ ఉన్న‌ది. గ‌తంలో అమెరికా పేరిట ఉన్న పాజిటివ్ కేసుల రికార్డును భారత్ తిర‌గ‌రాసింది. జ‌న‌వ‌రిలో అమెరికాలో ఓరోజు అత్య‌ధికంగా 2,97,430 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం ఆ కేసుల లోడ్ ను ఇండియా దాటేసింది. ఏప్రిల్ 15న తేదీ నుండి ప్ర‌తి రోజు రెండు ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ తారాస్థాయికి చేర‌లేదు. ఇప్ప‌ట్లో కొవిడ్ త‌న ఉగ్ర‌రూపాన్ని కోల్పోయే ఛాన్సు లేద‌ని నిపుణులు చెబుతున్నారు. గ‌త 24 గంట‌ల్లో మ‌హారాష్ట్ర (67,468), యూపీ(33,106),ఢిల్లీ (24,638),క‌ర్నాట‌క (23,558),కేర‌ళ (22,414)లో అత్య‌ధిక సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *