ప‌క్క రాష్ట్రం వాళ్లం కాబ‌ట్టే మాపై వివ‌క్ష చూపుతున్నారా…

హైద‌రాబాద్ః బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసు గంట‌కో మ‌లుపు తిరుగుతోంది. రోజులు గ‌డుస్తున్న కొద్ది సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. కొత్త వాద‌న‌లు, కొత్త కేసులు అనూహ్యంగా తెర‌పైకి వ‌స్తున్నాయి.ఈ నేప‌థ్యంలో మాజీమంత్రి అఖిల‌ప్రియ సోద‌రిభూమా మౌనిక మీడియాతో మాట్లాడారు. ఆమె అనేక విష‌యాలను వెలుగులోకి తెచ్చారు. కేసు తీరుపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య త‌మ అక్క‌ను రిమాండ్‌కు త‌ర‌లించార‌ని మౌనిక వాపోయారు. పోలీసుల తీరు భాద క‌లిగించింద‌ని, అఖిల‌ప్రియ అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంద‌ని ,రాత్రిభోజ‌నం పెట్ట‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హాఫిజ్ పేట్ లో ని 25ఎక‌రాల భూవివాదం వ్య‌క్తిగ‌త వివాదం కాద‌ని తెలిపారు. కంపెనీ పేరుతో నాన్న మామ ఏమీ సుబ్బారెడ్డి కొనుగోలు చేశారు. ప్ర‌వీణ్‌రావు కుటుంబం స‌భ్యులు పార్ట్ న‌ర్స్‌గా ఉన్నారు. మా నాన్న చ‌నిపోయాక భూమిపై వివాదం సృష్టించారు. ప్ర‌తాప్‌రావు చెబుతున్న‌ట్లు భూవివాదంపై కూర్చొని మాట్లాడానికి సిద్దంగా ఉన్నాం. గ‌తంలో నేనే ప్ర‌వీణ్ రావుతో మాట్లాడి ప‌రిష్కారం చేయాల‌ని కోరాను.నిన్న‌
ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అని చెప్పి అరెస్ట్ చేసి వ‌దిలేశారు. ఏ2గా ఉన్న మా అక్క‌ను ఏ1గా మార్చి రిమాండ్కు త‌ర‌లించారు.మామ‌కు ఓ న్యాయం ..మాకో న్యాయ‌మా? మేం ప‌క్క రాష్ట్రం వాళ్లం కాబ‌ట్టే మాపై వివ‌క్ష చూపుతున్నారా? మాకు న్యాయం కావాలి అనిభూమా మౌనిక కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *