మూడు నెల‌ల పాటు ఆట‌కు దూరం – బెన్‌ఫోక్స్

హైద‌రాబాద్‌: బెన్‌ఫోక్స్ తొడ‌కండరాల్లో చీలికరావ‌డంతో క‌నీసం మూడు నెల‌ల పాటు ఆట‌కు దూరం కానున్నాడు. అత‌ని స్థానంలో జేమ్స్ బ్రాసీని కీప‌ర్‌గా ఎంచుకున్న ఇంగ్లండ్ ప్ర‌త్నామ్నాయ బ్యాట్స్ మ‌న్‌కు హ‌సీబ్ హ‌మీద్‌ను కూడా ఎంపిక చేసింది. ఇంగ్లండ్ అత్యుత్త‌మ వికెట్ కీప‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బెన్ ఫోక్స్ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అరుదైన అవ‌కాశాన్ని కోల్పోయాడు. సుదీర్ఘ‌కాలం వేచి చూసిన త‌రువాత స్వ‌దేశంలో తొలిటెస్టు ఆడేందుకు సిద్ధ‌మైన అత‌ను డ్రెస్సింగ్ రూమ్‌లో సాక్స్‌లు వేసుకొని న‌డుస్తూ కాలు జారి ప‌డ్డాడు.దాంతో న్యూజిలాండ్‌తో పాటు ఇండియా తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఫోక్స్ దూరం కానున్నాడు.మ‌రో వైప్ పేస్ బౌల‌ర్‌జోఫ్రా ఆర్చ‌ర్ కుడి మోచేతికి శ‌స్త్ర చికిత్స జ‌రిగిన‌ట్లు ఈసీబీ ప్ర‌క‌టించింది. క‌నీసం నాలుగు వారాల త‌రువాత అత‌ను కోలుకుంటున్న తీరును చూసి బౌలింగ్‌ను మొద‌లు పెట్టే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *