కోల్ క‌తాలో ర్యాలీలోపాల్గొన్నాలో వ‌ద్దోతేల్చుకోవాల్సింది ఆయ‌నే….

కోల్‌క‌తా:భార‌త్ బీసీసీఐ అధ్య‌క్షుడు ,టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్‌గంగూలీ ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలోఈనెల‌7న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కోల్ క‌తాలో ర్యాలీ చేప‌డుతున్నారు ఇందులో గంగూలి పాల్గొన‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి అనుకూలిస్తే, ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాం బీజేపీ అధికార ప్ర‌తినిధి శామిక్ బ‌ట్టాచార్య అన్నారు. దీనిపై మంగ‌ళ‌వారం బీజేపీ స్పందించింది. ర్యాలీలోపాల్గొన్నాలో వ‌ద్దోతేల్చుకోవాల్సింది ఆయ‌నే అని, అది గంగూలీ ఇష్ట‌మ‌ని బీజేపీ స్ప‌ష్టం చేసింది.సౌర‌వ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సంగ‌తితెలిసిందే. ఆయ‌న ఆరోగ్యం బాగుంటే స‌భ‌కు హాజ‌ర‌వుతానంటే ఆయ‌నకు స్వాగ‌తం ప‌లుకుతాం.ర్యాలీని క‌చ్చితంగా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌తారు. అటు ప్ర‌జ‌లు కూడా ఇష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న వ‌స్తారో రారో మాకు తెలియ‌దు. అది ఆయ‌న ఇష్ట‌మ‌ని అన్నారు. ఇటీవ‌ల కాలంలో గుండెపోటుకు గురైన గంగూలీకి ఇప్ప‌టికే రెండు స్లారు యాంజియోప్లాస్టీ నిర్వ‌హించి మూడు స్టెంట్లు వేసిన విష‌యం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దీనిపై గంగూలీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏమీ స్పందించ‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *