అంత‌ర్జాతీయ ప్యాసింజ‌ర్ విమానాలపై నిషేధం…

హైదరాబాద్‌: ఇప్పుడు ఎక్క‌డ చూసిన క‌రోనా రోగం క‌రాళ‌నృత్యం చేస్తుంద‌ని తెలిసిన విష‌య‌మే.క‌రోనా గ‌త సంవ‌త్స‌రం జూన్ 30 నుండి అన్ని అంత‌ర్జాతీయ ప్యాసింజ‌ర్ విమానాలపై నిషేధం అమ‌ల్లో ఉంది. అయిన‌ప్ప‌టికీ ప్యాసింజ‌ర్ల రాక‌పోల‌కు అవ‌రోధం లేకుండా ప‌లు దేశాల‌తో ఇండియా చేస్తుకున్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్ర‌కారం ప‌లు అంత‌ర్జాతీయ విమానాల ఆప‌రేష‌న్ జ‌రుగుతోంది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భుటాన్‌, ఫ్రాన్స్ స‌హా 27దేశాల‌తో ఇండియా ఎయిర్ బ‌బుల్ ఒప్పందం కుదుర్చుకుంది.అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ విమానాల‌పై ఉన్న నిషేధాన్ని డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) మ‌రో నెల పాటు పొడిగించింది. జూన్‌30 వ‌తేదీ వ‌ర‌కూ ఈ నిషేధం పొడిగించిన‌ట్టు డీజీసీఏ శుక్ర‌వారంనాడు ప్ర‌క‌టించింది. అయితే, డీజీసీఏ ప్ర‌త్యేకంగా అనుమ‌తించిన అంత‌ర్జాతీయ కార్గో ఆప‌రేష‌న్లు, విమానాల‌కు మాత్రం ఈ ఆంక్ష‌లు వ‌ర్తించ‌వు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *