కేసీఆర్ సంబంధించిన సంచ‌ల‌న ప్ర‌ట‌క‌న -బండి సంజ‌య్‌

హైద‌రాబాద్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు సంబంధించిన సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డిస్తానంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సంజ‌య్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎంపీగా కేసీఆర్ పార్ల‌మెంట్ ను త‌ప్పుదోవ ప‌ట్టించారని, త‌న ద‌గ్గ‌ర ఆధారాలున్నాయ‌న్నారు. స్పీక‌ర్ అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం అనుమ‌తితో కేసీఆర్ బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌ని సంజ‌య్ అన్నారు. మీడియాత్ చిట్ చాట్ సంద‌ర్భంగా సంజయ్ ఈ వ్యాఖ్యాలు చేశారు. ఇదిలా ఉంటే, సంజ‌య్‌స‌మ‌క్షంలో క‌పిల‌వాయి దిలీప్‌కుమార్ శుక్ర‌వారం బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ వ్య‌తిరేక శ‌క్తుల‌న్నీ ఏక‌తాటిపైకి రావాల‌ని సంజ‌య్ పిలుపునిచ్చారు. ముమ్మాటికీ పార్ల‌మెంట్ను కుదిపేసే అంశ‌మ‌వుతోంద‌ని తెలిపారు. కేసీఆర్ రాజ‌కీయ స్వార్థం కోస‌మే పీవిని వాడుకుంటున్నార‌ని, పీవీ ఘాట్ ను ఎంఐఎం కూల్చుతామంటే కేసీఆర్ క‌నీసం దించ‌లేద‌న్నారు. మోసం చేయ‌టంలో కేసీఆర్ ఏక్ నంబ‌ర్… కేటీఆర్ ద‌స్ నంబ‌ర్ అని ఎద్దేవా చేశారు. వామ‌నరావు హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఓటేసీ పొర‌పాటు చేయొద్ద‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *