సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో గిరిజ‌నులు తెరాస‌కు బుద్ధి చెబుతారు-బండి సంజ‌య్‌

హైదరాబాద్: అడ‌వి ప్రాంతంలోని నివాస్తున్న ప్ర‌జ‌లు పోడు వ్య‌వ‌సాయం చేస్తారు.వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన గిర‌జ‌న ప్ర‌జ‌ల‌కు పొడు వ్య‌వ‌సాయం చేస్తారు. పొడుభూముల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వెంట‌నే విధివిధానాలు ప్ర‌క‌టించాల‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో సోమ‌వారం సేవాలాల్ మ‌హారాజ్ జ‌యంతి వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సేవాలాల్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌వేసి నివాళుల‌ర్పించారు. సేవాలాల్ సంచార జాతులను ఏక‌తాటిపైకి తీసుకొచ్చార‌న్నారు. ఆయ‌న తెలుగుగ‌డ్డ‌పై జ‌న్మించ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని కొనియాడారు. హైకోర్టు ఉత్త‌ర్వులిచ్చినా గుర్ర‌పుబోడు తండాలో గిరిజ‌నుల భూములు లాక్కునేందుకు ప్ర‌భుత్వం య‌త్నించ‌డం దారుణ‌మ‌ని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నాగార్జు సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్బంగా గిరిజ‌నులు ఐక్య‌మ‌వుతున్నార‌న్నారు. రాష్ట్రంలో ఉన్న‌10 శాతం మంది గిర‌జ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కావ‌ట్లేదు. రిజ‌ర్వేష‌న్ల ప‌ట్ల సీఎం
కేసీఆర్‌కు చిత్తుశుద్ది లేదు. సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో గిరిజ‌నులు తెరాస‌కు బుధ్ది చెబుతారు. తండాల‌ను పంచాయ‌తీలుగా చేసి నిధులు ఇవ్వ‌ట్లేదు. అని సంజ‌య్ మండిప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *