మొతెరాపిచ్‌పై భార‌త బ్యాట్స్‌మెన్ కాస్త మెరుగ్గానే రాణించారు..

అహ్మ‌దాబాద్‌: సుంద‌ర్ ఇన్నింగ్స్‌లో ప‌ది ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. రెండ‌వ రోజు కీప‌ర్ రిష‌బ్ పంత్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. నాల‌గ‌వ‌టెస్ట్ ను మొతెరా స్టేడియంలో జ‌రుగుతుంది. నాల‌గ‌వ టెస్ట్ తొలి ఇన్సింగ్స్ భార‌త్‌365 ర‌న్స్‌కుఆలౌటైంది.బ్యాటింగ్‌కు క‌ష్టంగా మారిన మొతెరా పిచ్‌పై భార‌త బ్యాట్స్‌మెన్ కాస్త మెరుగ్గానే రాణించారు. మ‌రో రెండున్న‌ర రోజు ఆట మిగిలి ఉన్న నేప‌థ్యంలో మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండియాకు 160 పరుగులు ఆధిక్యం ఉన్నా..ఇంగ్లండ్ త‌మ రెండ‌వ ఇన్నింగ్స్ ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే. ఈ రోజు ఉద‌యం వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్43 ర‌న్స్ చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బెన్‌స్టోక్స్ నాలుగు వికెట్లు తీసుకోగా.. జేమ్స్ అండ‌ర్స‌న్ మూడు,లీచ్ రెండేసీ వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్ త‌న తొలి ఇన్సింగ్స్‌లో 205 ర‌న్స్‌కు ఆలౌటైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *