రెండో టెస్ట్ లో భార‌త్ ప‌ట్టు బిగిస్తుంది….

ప్ర‌స్తుతం మెల్ బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో భార‌త్ ప‌ట్టు బిగిస్తుంది. జ‌ట్టు స్కోరు 36 ప‌రుగుల వ‌ద్ద రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్ టీ విరామం స‌మ‌యానికి ఐదు వికెట్లు కోల్పోయి 189 ప‌రుగులు చేసింది. అజింక్యా ర‌హానే(53 ) అర్థ సెంచ‌రీ చేయ‌డంతో టీమిండియా ప‌టిష్ట స్థితిలో ఉంది. అంత‌క‌ముందు చ‌తేశ్వ‌ర్ పూజారా ఫాస్ట్ బౌల‌ర్ పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ టీమ్ పైనీకి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న శుభ‌మ‌న్‌గిల్ కూడా అదే త‌ర‌హాలోకీప‌ర్ క్యాచ్ ఇచ్చి ఔట‌వ‌డం విశేషం. ఇక కుదురుకుంటున్న స‌మ‌యంలో హ‌నుమ విహారి(21),రిష‌బ్‌పంత్‌(28) అన‌వ‌స‌ర‌పు షాట్ ఆడి వికెట్ స‌మ‌ర్పించుకున్నారు. ఇప్పుడు క్రీజులో ర‌హానేతో పాటు జ‌డేజా(4) ఉన్నారు. మ‌రో6 ప‌రుగులు చేస్తే టీమిండియా ఆసీస్ స్కోర్‌కి స‌మం అవుతుంది. ఆసీస్ బౌల‌ర్స్‌లో క‌మిన్స్‌2,స్టార్క్ 2, క‌మిన్స్ ఓ వికెట్ తీసుకున్నారు. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ క‌న్నా అద‌నంగా 50 ప‌రుగులు చేస్తే మ్యాచ్‌పై ప‌ట్టు బిగించే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *