మ‌సీదుకు చందాలు ఇవ్వోద్దు…

న్యూఢిల్లీ: హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. అయోధ్య‌లో నిర్మించ‌బోయే మ‌సీదుకు ఎవ‌రూ చందాలు ఇవ్వ‌కూడ‌ద‌ని పిలుపునిచ్చారు. అక్క‌డ న‌మాజు చేయ‌డ‌మే ఇస్లాంకు వ్య‌తిరేక‌మ‌ని (హ‌రామ్‌) ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. బీద‌ర్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అస‌ద్ మ‌సీదు అని అన‌రని, అక్క‌డ ప్రార్థ‌న‌లు చేయ‌కూడ‌ద‌ని ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డుకుచెందిన ఉలేమాలే చెబుతున్నార‌ని అస‌ద్ అన్నారు. రిప‌బ్లిక్‌డేనాడే అయోధ్య‌లో మసీదు నిర్మాణం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. బాబ్రీ మ‌సీదు కంటే పెద్ద‌గా దీనిని నిర్మించ‌నున్నారు. అయితే అస‌ద్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. అయోధ్య మ‌సీదు ట్ర‌స్ట్ కార్య‌ద‌ర్శి అథ‌ర్ హుస్సేన్‌. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న రాజ‌కీయ ఎజెండాలో భాగ‌మ‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *