ఢిల్లీ ప్ర‌భుత్వం స్కూళ్ల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం….

దిల్లీ: న‌గ‌రంలో ఉన్న పాఠ‌శాల‌ల‌న్నింటినీ ఒకే బోర్డు ప‌రిధిలోకితీసుకొచ్చే ఉద్దేశంతో నూత‌న స్కూల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప్ర‌భుత్వం స్కూళ్ల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. న‌గ‌రంలో ఉన్న దాదాపు 2,700 స్కూళ్లు నూత‌న గా ఏర్పాటు చేయ‌బోయే దిల్లీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేష‌న్ (డీబీఎస్ఈ) ప‌రిధిలోకి రానున్నాయి. 20201-22 తొలుత ప్ర‌భుత్వ స్కూళ్లు.. రాబోయే నాలుగైదేళ్ల‌లో మిగ‌తా అన్ని స్కూళ్లూ ఈ బోర్డులోకి తీసుకురానున్న‌ట్లు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నేడు వెల్ల‌డించారు. ఇప్పుడు దిల్లీ ప‌రిధిలో సుమారు వెయ్యి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, 1700 ప్రైవేటు పాఠ‌శాల‌లు ఉన్నాయి. ఇందులో చాలా వ‌ర‌కు సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్నాయి. నూత‌న‌గా ఏర్పాటు చేయ‌బోయే స్కూల్ బోర్డుకు పాల‌క‌మండ‌లి అధ్య‌క్షుడిగా దీల్లీ విద్యాశాఖ మంత్రి వ్య‌వ‌హ‌రిస్తారు. ఎగ్జిక్యూటివ్ బాడీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ నేతృత్వం వ‌హించ‌నున్నార‌ని కేజ్రీవాల్ తెలిపారు. విద్యార్థుల్లో దేశ‌భ‌క్తిని పెంపొందించ‌డం, వారి కాళ్ల‌పై వారు నిల‌బ‌డేలా చేయ‌డం, నిస్వార్థంగా దేశానికి, స‌మాజానికి సేవ చేయాల‌నే దృక్ప‌థం అల‌వాటు చేయాల‌న్న‌దే డీబీఎస్ ఈల‌క్ష్య‌మ‌ని వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *