175నియోజకవర్గాల్లో రైతులు, రైతుకూలీలకు మద్దతుగా..

రాష్ట్రంలో వైసిపి పాలనలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులు, మహిళా రైతుల కష్టాలపై తెలుగుదేశం పార్టీ ‘‘రైతు కోసం’’ 3రోజుల ఆందోళనా కార్యక్రమాలను నేటి(డిసెంబర్ 28)నుంచి చేపడుతోంది. గత 19నెలల్లో అటు మద్దతు ధర లేక, ఇటు పెట్టుబడులు కోల్పోయి, అప్పుల పాలైన రైతాంగం సమస్యలు, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం సకాలంలో కట్టకపోవడంతో రైతులకు కల్గిన వేలకోట్ల నష్టం, 7వరుస విపత్తుల్లో పైసా పరిహారం అందించక పోవడం, ఒకవైపు ఇన్సూరెన్స్ చెల్లించక మరోవైపు ఇన్ పుట్ సబ్సిడి అందక, ఇంకోవైపు మద్దతు ధరలేక, ప్రభుత్వసాయం దక్కక నాలుగిందాలా నష్టపోయి మనోవేదనతో 800మందిపైగా రైతులు, రైతుకూలీలు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో, బాధిత రైతాంగానికి భరోసా కల్పించడం, రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వంటి రైతాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఘటించడం..
టిడిపి 3రోజుల ఆందోళనల ప్రధాన లక్ష్యం..
సోమ, మంగళ, బుధవారాల్లో జరిగే ఈ నిరసన కార్యక్రమాల్లో టిడిపి శ్రేణులంతా పాల్గొని రైతులు, రైతుకూలీలు, మహిళా రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రపార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు. తొలిరోజున: రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతుకూలీల ఇళ్లకు సోమవారం టిడిపి నాయకులు వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారు. పార్టీ తరఫున వారికి భరోసా ఇవ్వడం, మనోధైర్యం పెంచడం చేస్తారు. మృతి చెందిన రైతుల జ్ఞాపకాలను(వాడిన ముల్లుగర్ర, పైపంచె, కండువా, చెప్పులు..)సేకరించి 3వ రోజున అధికారులకు అందజేస్తారు..
2వరోజు(మంగళవారం): రైతులు, రైతుకూలీల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమం నిర్వహిస్తారు. విపత్తు నష్ట పరిహారం అంచనాల తయారీ, రైతుల జాబితా పరిశీలించి అక్రమాలను ఎండగడ్తారు. నష్టపోయిన రైతులందరికీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడి దక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం..కనీస మద్దతు ధర లభించక నష్టపోయిన రైతాంగానికి అండగా నిలబడి వారిలో భరోసా కల్పించడం..రైతుల మీటర్లకు మోటార్లు పెట్టడంపై ప్రతిఘటించడం చేస్తారు.
3వరోజు(బుధవారం): 175నియోజకవర్గాల్లో రెవిన్యూ కార్యాలయాలు, వ్యవసాయాధికారి కార్యాలయాల వరకు పాదయాత్రలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో రైతులకు జరిగిన నష్టాలపై వినతి ప్రతాలు అందజేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలనుంచి సేకరించిన జ్ఞాపకాలను(వాడిన ముల్లుగర్ర, పైపంచె, కండువా, చెప్పులు..) సదరు అధికారులకు అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి తక్షణమే ముందుకొచ్చి యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకునేలా ఒత్తిడి తేవడమే లక్ష్యంగా టిడిపి శ్రేణులంతా ఆందోళనా బాట పట్టనున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *