నగర పంచాయతీ కమిషనర్‌ స్పస్పెన్షన్

ఉయ్యూరు: కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్తవేసిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ డా.ప్రకాశరావును సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. స్పస్పెన్షన్‌కు ముందు కమిషనర్‌ మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది, లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ముందు చెత్తవేయడం బాధాకర అంశమని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. ఈ విషయంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు దెబ్బతిని ఉంటే తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు, నగర పంచాయతీ వర్గాలు సమైక్యంగా ముందుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చెప్పారు. నగర పంచాయతీ కమిషనర్‌ ప్రకాశరావు క్షమాపణ చెప్పిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం గమనార్హం. మరోవైపు ఈ తరహా ఘటనపై మచిలీపట్నం, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లను ప్రభుత్వం వివరణ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *