బుధ‌వారం నుండి ప‌గ‌టి పూట కూడా క‌ర్ప్యూ..

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువ అవ‌డం వ‌లన ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనాపై స‌మీక్షంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య త‌గ్గించ‌డం, బెడ్‌ల కొర‌త నివారించేందుకు అవ‌స‌ర‌మైన చర్య‌ల‌పై సీఎం చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. చ‌ర్య‌ల త‌రువాత సీఎం కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. కొవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు బుధ‌వారం నుండి ప‌గ‌టి పూట కూడా క‌ర్ప్యూ విధించాల‌ని నిర్ణ‌యించారు. ఉద‌యం 6నుండి మ‌ధ్యాహ‌న్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే షాపుల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. 12గంట‌ల త‌రువాత అత్య‌వ‌స‌ర సేవ‌లు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నున్నాయి. ఆ స‌మ‌యంలో 144 వ సెక్ష‌న్ అమ‌లులో ఉండ‌నుంది. ఈ ఆంక్ష‌ల‌ను రెండు వారాల పాటు అమలు చేయ‌నున్నారు. ఏపీలో ఇప్ప‌టికే రాత్రి పూట క‌ర్ప్యూ అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *