ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు ఓర్వ‌లేక ప‌తిప‌క్షాల కుట్ర‌..

హైద‌రాబాద్ః ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షాల‌పై కుట్ర‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ప్ర‌భుత్వం చేసే మంచి ప‌నులు ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ఉండ‌టం కోసం కుట్ర‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మంచి పనులు చూడలేక పోతున్నార‌ని వాపోయారు. ముఖ్యంగా ప్రతిప‌క్షానేత కుట్ర క‌డుపుమంట‌తో విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని ఆరోపించారు జ‌గ‌న్‌. ర‌థాల‌ను ఎవ‌రు త‌గ‌ల‌బెడుతున్నారు,ర‌థ‌యాత్ర‌లు ఎందుకు చేయ‌బోతున్నారో ప్ర‌జ‌లు ఆలోచించాల‌న్నారుసీఎం జ‌గ‌న్‌. ఏప‌థ‌కం చేప‌ట్టినా ఆ కార్య‌క్ర‌మానికి అడ్డు త‌గిలేలా గుడులు,గోపురాల‌ను టార్గెట్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అమ్మ‌వారి గుడిలో క్షుద్ర‌పూజ‌లు చేసిన‌వారు ప్ర‌స్తుతం కొత్త వేషం క‌డుతున్నార‌ని మండిపడ్డారు సీఎం. ప్ర‌జ‌లు చ‌స్తే ఎంత అన్న‌ట్లు బాబుగారి కోర్టులు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇస్తున్నారని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు జ‌గ‌న్‌. ఇన్ని చేస్తున్నాం. కాబ‌ట్టే.. ప్ర‌తిఫ‌క్షాల‌కు చోటు లేకుండా పోతుంద‌నే ఉద్దేశ్యంతో ఇలాంటి నీచాల‌కు దిగుతున్నార‌ని విమ‌ర్శంచారు. ధ్వంస‌మైన విగ్ర‌హాల‌ను చూడ‌టానికి వాళ్లు ఎందుకు వెళుతున్నారో తెలుసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేసే ప్ర‌భుత్వం చేప‌ట్టే ఏ ప్రోగ్రామైనా… అందుకు ముందుగా, లేదా త‌రువాత‌..గుళ్లు,గోపురాల‌కు చీక‌ట్లో వెళ్లి టార్గెట్ చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అలాంటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌తో పోర‌టం చేస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ కు భ‌య‌ప‌డి ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు ,ఆయ‌న కొడుకు ఇంట్లోనే దాక్కున్నార‌ని ఎద్దేవా చేశారాయ‌న‌.. ప్ర‌తి పేద ఇంటికీ, పేదింటి ప‌ల్ల‌ల‌కు వారి త‌ల్లిదండ్రుల‌కు మంచి చేయాల‌నే సంక‌ల్పానికి అడ్డు త‌గులుతున్నార‌ని తెలిపారు. వాళ్ల‌కు ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్న ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌కొడుతున్న వారిని గ‌మనించాలన్నారు సీఎం జ‌గ‌న్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *