రెండు జిల్లాలో ఎస్ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పంచాయ‌తీ ఎన్నిక‌ల ఏక‌గ్రీవాల‌పై ఎస్ఈసీ ని‌మ్మిగ‌డ్డ ర‌మేష్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రెండు జిల్లాల్లో ఏక‌గ్రీవ ఎన్నిక‌ల‌పై ప‌లు అనుమానం వ్య‌క్తం చేశారు. పూర్తి నివేదిక ఇవ్వాల‌ని చిత్తూరు, గుంటూరు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ఆదేశించారు. మిలిగిన 11 జిల్లాల‌లో ఏక‌గ్రీవాలు సాధార‌ణంగానే ఉన్నాయ‌న్నారు. మొద‌టి విడ‌త ఎన్న‌క‌ల్లో చిత్తూరు 110 గుంటూరు జిల్లాలో 67 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఏక‌గ్రీవాల‌ను గుడ్డిగా ఆమోదించొద్ద‌ని ఎస్ఈసీ చెబుతోంది…. మొద‌టి ద‌శ ఎన్నిక‌ల్లో ఎక్కువ ఏకగ్రీవాలు చిత్తూరు. గుంటూరు జిల్లాల్లో ఉండ‌టంతో ట్విస్ట్ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలి విడ‌త నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డుపు గురువారంతో ముగిసింది. ఏపీరాష్ట్రంలో మొద‌ట ద‌శ‌లో 3249 పంచాయితీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుండ‌గా..453 పంచాయ‌తీలు ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు లో అత్య‌ధికంగా 110 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయ్యాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాలో 67 పంచాయ‌తీలు ఏక‌గ్రీవమ‌య్యాయి. క‌ర్నూలు జిల్లాలో 54, వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలో 46, శ్రీ‌కాకుళం జిల్లాలో 34 ,ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 40, విశాఖ జిల్లాలో32, ప్ర‌కాశం జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 20, తూర్పుగోదావ‌రి జిల్లాలో 28 ఏక‌గ్రీవం అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *