టీకా వేసుకున్నంత మాత్ర‌నా కోవిడ్ సోక‌ద‌నుకోవ‌టం ప‌ర‌ప‌టే…

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్రజ‌ల‌ను ప‌ట్టిడిస్తోందని తెలిసిన విష‌య‌మే, కాని కొవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తిస్తోంది.వ్యాక్సిన్ టీకా వేసుకునంత మాత్రానా కొవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ సోక‌ద‌ని చెప్ప‌లేమ‌ని ఆరోగ్య అభివృద్ధి వ్య‌వ‌హారాల ఆర్థిక వేత్త ప్రొఫెస‌ర్ అనుప్ మ‌లానీ పేర్కొన్నారు. అయితే టీకా తీసుకున్న వారిలో వ్యాధి తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికి, వేగంగా న‌యం కావ‌డానికి వ్యాక్సిన్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇండియాలో ఈ మ‌ధ్య‌కాలంలో క‌రోనా కేసులు భారీగా పెరుగ‌డానికి రీ ఇన్‌ఫెక్ష‌న్లే కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చున‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అనూప్ మ‌లానీ షికాగో విశ్వ‌విద్యాల‌య లా స్కూల్‌,ప్రిట్జ్‌క‌ర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో బోధ‌నా విధులు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో ఒక‌సారి క‌రోనా సోక‌డం,టీకాలు పొంది ఉండ‌టంవ‌ల్ల ఆ మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ ల‌భించ‌లేదు. అయితే ఆ రెండు అంశాల‌వ‌ల్ల ల‌భించిన రోగ‌నిరోధ‌క శ‌క్తి చాలా ప్ర‌యోజ‌న‌క‌రం. అలాంటివారికి ఇన్‌ఫెక్ష‌న్ సోకితే వేగంగా న‌య‌మ‌వుతుంది. అని ఆయ‌న తెలిపారు. దీనివ‌ల్ల మ‌ర‌ణాలు, తీవ్ర అనారోగ్యాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌ని వివ‌రించారు. స‌ద‌రు వ్య‌క్తుల నుంచి ఇత‌రుల‌కు వైర‌స్ వ్యాప్తి చెందే ప్ర‌మాదం కూడా త‌గ్గుతుంద‌న్నారు. భారీగా గుమికూడ‌టం, అక్క‌డి జ‌నాభాలో రోగ నిరోధ‌క స్థాయి వంటివి ప్ర‌భావం కూడా చూపుతాయ‌ని తెలిపారు. ,ప్ర‌జ‌లు క‌రోనా పై విసుగెత్తిపోవ‌డం లేదా టీకా వ‌చ్చింద‌న్న భ‌రోసాతో ఉండ‌టంవ‌ల్ల మాస్కులుధ‌రించ‌డంలేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *