రాజకీయాల సౌల‌భ్యం కోసం దేవుల‌ను వాడుకుంటున్నారు…

హైద‌రాబాద్ః ప్ర‌జ‌ల న‌మ్మ‌కాల‌ను విశ్వాల‌ను దెబ్బ‌తీయ‌డానికి రాజకీయాలు న‌డుపుతున్నారు.దెవుడి విగ్ర‌హం ప‌ల‌గొట్టితే ఎవ్వ‌రికి లాభం.రాష్ట్రంలో దేవాల‌యాల విష‌యంలో జ‌రుగుతున్న రాజ‌కీయంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందించాడు. ప్ర‌జ‌ల్లో ఇంత మంచి చేస్తా ఉంటే…ఇలాంటి ప‌రిపాల‌న‌ను ఎదుర్కొవ‌డం క‌ష్ట‌మ‌ని కుయుక్తులు,కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. పూర్వ‌కాలంలో పోలీసులు వ‌స్తువుల‌ను ఎత్తుకుపోయే దొంగ‌ల‌ను, తాళాలు ప‌గ‌ల‌గొట్టి.. నేరాలు పాల్ప‌డే దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డానికి ద‌ర్యాప్తు చేసేవారు. ఇవాళ ప‌రిస్థితులు అలా లేవు…. సైజ‌ర్‌నేరాలు వ‌చ్చాయి. వైట్ కాల‌ర్ నేరాలు, సోష‌ల్‌మీడియాలో అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు వ‌చ్చాయి. క‌లియుగంలో క్లైమాక్స్‌కు వ‌చ్చామా? అనే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. దేవుడంటే భ‌యం లేదు. భ‌క్త లేద‌నే ప‌రిస్థితికి వ్య‌వ‌స్థ దిగ‌జారింది. దేవుడిని రాజ‌కీయం చేసి లాభం పొందాల‌నే స్థితిలోకి వ‌చ్చారు. ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని జ‌గ‌న్ కోరారు. మ‌న ప్ర‌భుత్వం ఏదైనా మంచి ప‌నిచేస్తుంటే. ఆ ప్ర‌తిష్ట ప్ర‌భుత్వానికి రానీయ‌కుండా చూడ్డానికి ఇలాంటి దుర్మార్గాల‌కు ఒడిగ‌డుతున్నార‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టాల‌ని చూస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 20వేల గుళ్లలో సీసీ కెమెరాలు పెడుతున్నాం. విగ్ర‌హాల‌ను ఎవ‌రు ధ్వంసం చేసినా ఊరుకునే ప్ర‌స‌క్తేలేదు.. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకుంటుక‌న్నారు. ఎవ్వ‌రినీ వ‌ద‌లొద్దు.. ఆల‌యాల‌పై సోష‌ల్‌మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగ‌తోంది అని జ‌గ‌న్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *