ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు 88 న‌మోదు…

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. గ‌త 10 రోజులుగా 50-70 మ‌ధ్య‌కేసులు న‌మోద‌వుతుండ‌గా ఆదివారం కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా 88 మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. వైర‌స్ బారిన‌ప‌డి వారిలో 72 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్ప‌టివ‌రకు 8,89,298 మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు.8,81,511 మంది చికిత్స‌కు కోలుకున్నారు. మ‌రో 620 మంది చికిత్స పొందుతున్నారు. వైర‌స్ ప్ర‌భావంతో నేటివ‌ర‌కు 7,167 మంది మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 31,680 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. నేటివ‌ర‌కు 1,37,28,728 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *