అధికార పార్టీ నేత‌లు తీరు మారాలి..

హైద‌రాబాద్‌:తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న తరువాత మీడియా మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. రాష్ట్రంలో 30,144 సెక్ష‌న్‌ల‌ను ఇష్టారాజ్యంగా అమ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం . అదృష్టం అంద‌లం ఎక్కిస్తే… బుద్ధి మాత్రం బుర‌ద‌లో ఉంటుందాని వైసీపీని విమ‌ర్శించారు. సోష‌ల్ పోస్టింగ్‌ల‌పై కూడా నేర‌స్థుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు చేసి హింసిస్తున్నార‌ని మండిప‌డ్డారు. వేరే మాతాల‌పై దాడి జ‌రిగితే ప్ర‌పంచ అంతా గోగ్గ‌లు పెట్టేద‌ని, కానీ, హిందూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రిగితే ప‌ట్టించుకోరా అంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 142 దేవాల‌యాల‌పై దాడి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. సెక్యుల‌రిజం అనే ప‌దానికి ఇండ‌యాలోఅర్థం వేరు.. హిందూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రిగితే మాట్లాడ‌కూడ‌దా?రాముల‌వారి విగ్ర‌హం త‌ల న‌రికేస్తే.. సున్నిత‌మైన అంశం కాబ‌ట్టి నేను అక్క‌డికి వెళ్ల‌లేదు. అధికార పార్టీ నేత‌లు తీరు మారాలి. విగ్రాహాలు పోతే మ‌ళ్లీ చేయిస్తాం. రాముడికి త‌ల‌కాయ న‌రికేస్తే.. త‌ల పెడతాం .. అంటూ మాట‌లు మాట్లాడ‌కూడ‌దు. ఈ మాట చ‌ర్చ్ విష‌యంలో జ‌రిగితే అంటారా? మ‌సీదులు విష‌యంలో జ‌రిగితే మాట్లాకుండా ఉంటారా? హిందువుల ప‌ట్ల ఒక‌లా ఇత‌ర మ‌తాల ప‌ట్ల ఒక‌లా స్పందించ‌టం త‌ప్పు. అని మ‌తాల ప‌ట్ల స‌మ‌భావ‌మే సెక్యుల‌రిజం. సెక్యుల‌రిజం అంటే హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రిగితే మౌనంగా ఉండ‌ట‌మా? అని ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *