ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను నియంత్రించే బాధ్య‌త రాష్ట్రాల‌దేన‌ని కిష‌న్‌రెడ్డి..

హైద‌రాబాద్‌: ప‌్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన క‌రోనా రోగం విజృభిస్తున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ పెట్టుకునే స్వేచ్ఛ రాష్ట్రాల‌దేన‌ని కేంద్ర‌స‌హాయ‌మంత్రి కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. అక్క‌డ ఉన్న ఆర్థిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి లాక్‌డౌన్ విధించుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఆనంద‌య్య మందును ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు… ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ను పంపితే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. ఆనంద‌య్య మందులా దేశ న‌లుమూల‌ల నుండి త‌మ‌కు వేల విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయ‌ని కిష‌న్‌రెడ్డి పేర్కొన్నారు. కాక్‌టెయిల్ మందు పంపిణీపై కేంద్రం ప‌రిశోధ‌న‌లు చేస్తోంద‌న్నారు. ప్రైవేటు ఆస్ప‌త్రుల బ‌య‌ట రేట్ల వివ‌రాల బోర్డులు పెట్టాల‌ని , ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను నియంత్రించే బాధ్య‌త రాష్ట్రాల‌దేన‌ని కిష‌న్‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *