ప్రాంతాల వారీగా పుర‌పాలిక ఎన్నిక‌ల‌పై స‌మావేశాలు.-ఎస్ఈసీ

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో మొన్న‌టిదాక పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇప్పుడు ఏపీరాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పుర‌పాలిక ఎన్నిక‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో స‌మావేశం కానుంది. అలాగే, పుర‌పాలిక ఎన్నిక‌ల‌పై ప్రాంతాల‌వారీ స‌మావేశాల‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది. అధికార యంత్రాంగం సన్న‌ద్ధత కోస‌మే ఈ స‌మావేశాల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించింది. ఈనెల‌27,28 మార్చి 1న ప్రాంతీయ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల‌27న తిరుప‌తిలోని ఎస్వీయూనివ‌ర్సిటీ సెనేట్ హాల్‌లో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించింది. ఈ స‌మావేశాల్లో భాగంగా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో ఎస్ ఈసీ స‌మావేశం కానుంది. ఈ నెల‌27న శ‌నివారం ఐదు జిల్లాల్లో రాజ‌కీయ‌పార్టీల నేత‌ల‌తో స‌మావేశం ఉంటుంది. అనంత‌రం, ఎల్లుండి విజ‌య‌వాడ‌లోని కార్యాల‌యంలో ఎస్ఈసీ స‌మావేశం నిర్వ‌హిస్తుంది. ఇందులో మిగిలిన జిల్లాల అధికారులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *