నూత‌న ఎస్ఈసీ భుజ‌స్కందాల పైనే బాధ్య‌త‌లు- నిమ్మ‌గ‌డ్డ‌

అమ‌రావ‌తి: ఏపీలో ఇప్పుడు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు త‌న‌కు స‌మ‌యం లేద‌ని ఎస్ ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు షెడ్యూల్ జారీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాన‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. 4 వారాలు ఎన్నిక‌ల కోడ్ విధించాల‌న్న బాధ్య‌త‌నూ నెర‌వేర్చ‌లేన‌ని పేర్కొన్నారు. ఇప్పుడు సిబ్బంది కొవిడ్ టీకా వేయించుకోవ‌డంలో నిమ‌గ్న‌మ‌య్య‌ర‌ని ఎస్ ఈసీ తెలిపారు.కొత్త ఎస్ ఈసీ భుజ‌స్కందాల‌పైనే బాధ్య‌త‌ల‌న్నీ ఉంటాయ‌ని నిమ్మ‌గ‌డ్డ తెలిపారు. మ‌రోవైపు రాష్ట్రంలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌ను నిలిచిపోయిన ద‌గ్గ‌ర్నుంచి నిర్వ‌హించేలా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని (ఎస్ ఈసీ), ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను ఆదేశించాల‌ని కోరుతూ దాఖ‌లైన వ్యాజ్యంలో మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *