నీలం సాహ్నితో స‌మావేశం- బ‌హిష్క‌రించినప్ర‌తిప‌క్ష‌పార్టీలు

విజ‌య‌వాడ‌: ఏపీలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించేందుకు వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. విజ‌య‌వాడ‌లో ఎస్ ఈసీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశానికి వైకాసా, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు ఈ స‌మావేశాన్ని బ‌హిష్క‌రిస్తున్నామ‌ని టీడీపీ , జ‌న‌సేన‌, బీజేపీ ప్ర‌క‌టించాయి. గురువారం సాయంత్రం స‌మావేశ ఆహ్వానం పంపిన ఎస్ ఈసీ.. రాత్రి ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌డం, పాత నోటిఫికేష‌న్ ప్ర‌కార‌మే నిర్వ‌హిస్తామ‌ని నిర్ణ‌యించ‌డం అప్ర‌జాస్వామిక చ‌ర్య‌గా పేర్కొన్నాయి. జ‌న‌సేన హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ విచార‌ణ‌కు రాక‌ముందే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ తెలిపారు. ఈ నిర్ణ‌యం అధికారపార్టీకి ల‌బ్ది చేకూర్చేందుకేన‌ని జ‌న‌సేన భావిస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *