రైతులకు భ‌రోసా ఇచ్చిన ఏపీ ప్ర‌భుత్వం….

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనాక‌ర‌ళానృత్యం చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు అనేక ర‌కాల ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. నానాఅవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో రాష్ట్రప్ర‌భుత్వం రైతు భ‌రోసా ద్వారా అర‌కోటి మంది రైతుల‌కు ల‌బ్ది చేకూరుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.89 వేల కోట్లు ప్ర‌జ‌ల ఖాతాలోకి నేరుగా పంపాం.గ‌త 23 నెల‌ల్లో రైతు భ‌రోసా కింద రూ.17 వేల 29 కోట్లు విడుద‌ల చేశాం. ఇన్ పుట్ స‌బ్సిడీ కింద రూ.1,038 కోట్లు ఇచ్చాం. అని సీఎం వివ‌రించారు. 52.38 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.3,928 కోట్ల సాయం అందించిన‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. రైతు భ‌రోసా. పీఎం కిసాన్ ప‌థ‌కంలో భాగంగా మూడో సంవ‌త్స‌రానికి తొలి విడత సాయమందిస్తున్న‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే ఎక్కువ‌గా ఇస్తున్న‌ట్లు తెలిపారు. కరోనా క‌ష్ట‌కాలంలో ఆర్థిక వ‌న‌రులు అనుకున్న స్థాయిలో లేక‌పోయిన‌ప్ప‌టీకీ రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కూడ‌ద‌ని వైఎస్ ఆర్ రైతు భ‌రోసా మొద‌టి నిధుల‌ను విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *