ప్ర‌జ‌ల ప్రాణాలు ఎలా కాపాడాల‌నే దానిపై స‌మీక్ష‌లు చేయండి…

అమ‌రావతి: ఏపీ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా క‌ర‌ళ నృత్యం చేస్తున్న విష‌య‌మే తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న ప‌రిస్థితులు కొవిడ్ పేషెంట్ల‌కు కనీస వైద్య‌సేవ‌లు అంద‌డంలేద‌ని కాకినాడి ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూసైనా మాన‌వ‌త్వంతో స్పందించండి జ‌గ‌న్ గారూ అని ట్వీట్ చేస్తే …త‌న‌పై ఫేక్ కేసులు పెట్టించార‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ మండిప‌డ్డారు. ఆస్ప‌త్రిలో ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దేందుకు మాత్రం చ‌ర్య‌లు తీసుకోవ‌లేద‌ని అన్నారు. త‌న‌కు వైద్యం అంద‌డంలేద‌ని సెల్పీ వీడియోలో వేడుకున్నారు. క‌లెక్ట‌ర్ ఆదేశించినా వైద్యం అంద‌క ఆమెతో పాటు క‌డుపులో బిడ్డ కూడా క‌న్నుమూసింది. వ‌లంటీర్‌తో పాటు ఆమె క‌డుపులో ఉన్న ప‌సిగుడ్డు మ‌రణానికి మీ చేత‌కాని పాల‌న కార‌ణం కాదా? జ‌గ‌న్‌రెడ్డి గారూ! ఇప్ప‌టికైనా తాడేప‌ల్లి కొంప‌లో కూర్చుని ప్ర‌తిప‌క్షంపై ఎలా త‌ప్పుడు కేసులు పెట్టాల‌నే కుతంత్రాలు మానేసి, ప్ర‌జ‌ల ప్రాణాలు ఎలా కాపాడాల‌నే దానిపై స‌మీక్ష‌లు చేయండి మూర్ఖపు ముఖ్య‌మంత్రి గారూ! అంటూ లోకేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *