క‌రోనా క‌ర‌ళ‌నృత్యం చేస్తుంటే జ‌గ‌న్ స‌ర్కారు చేతులెత్తేసింద‌న్నారు…..

అమ‌రావ‌తి: ఏపీలో రాష్ట్రంలో గ‌ణ‌నీయంగా కేసులు పెరుగుతున్నాయ‌ని ,ఆక్సిజ‌న్ అంద‌క‌, బెడ్లు దొర‌క్క పేషెంట్లు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. సీఎంజ‌గ‌న్ అల‌స‌త్వానికి ఇంకెంద‌రు బ‌లికావాల‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారాచంద్ర‌బాబునాయుడు అన్నారు. ఓ బాధ్యతాయుత ప్ర‌తిప‌క్షంగా తాము కొవిడ్‌పై ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేస్తుంటే త‌న‌పైనే ప్ర‌భుత్వం ఎదురు దాడికి దిగుతోంద‌న్నారు. కొవిడ్‌పై జ‌గ‌న్‌స‌ర్కారు చేతులెత్తేసింద‌ని ,వైసీపీ నేత‌లే రాజ‌మండ్రిలో మాట్లాడుకున్నార‌ని విమ‌ర్శించారు. కొవిడ్‌పై నియంత్ర‌ణ‌పై సోష‌ల్ మీడియాలో అభూతి క‌ల్ప‌న‌లు చేడ‌యం సిగ్గుచేట‌ని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయండి.. ప్రాణాలు కాపాడండి అన్న నినాదంతో ఈనెల‌8న ప్ల‌కార్డులు ప్ర‌ధ‌ర్శిస్తూ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మ‌హారాష్ట్ర,కేర‌ళ‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రుల లాగా సీఎం జ‌గ‌న్ కూడా వ్యాక్సినేష‌న్ కు వెంట‌నే ఆర్డ‌ర్ ఇవ్వాల‌ని సూచించారు. దేశంలో క‌రోనా తీవ్ర‌త ఉన్న‌33 జిల్లాల జాబితాలో ఏపీకి చెందిన‌7జిల్లాల ఏపీలో ఉన్నాయ‌ని కేంద్రం పేర్కొందని, ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టిలోకి తీసుకున్నారా? అని బాబు ప్ర‌శ్నించారు. వ్యాక్సిన్ త‌ప్ప‌, క‌రోనా నియంత్ర‌ణ‌కు మ‌రో మార్గ‌మే లేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. చంద్ర‌న్న బీమా ఉండి ఉంటే మృతుల కుటుంబాల‌కు 10ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పుల స‌హాయం వ‌చ్చేద‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ప్ర‌జారోగ్యంతో సీఎం జ‌గ‌న్ చెల‌గాట‌మాడుతున్నార‌ని ఎద్దేవాచేశారు. వైసీపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే రాష్ట్రంలో క‌రోనా విల‌యం సృష్టిస్తోంద‌ని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *