వైకాపా పాల‌న‌పై చ‌ర్చ‌కు ధైర్య‌ముందా- చంద్ర‌బాబు స‌వాల్ విసిరారు

హైద‌రాబాద్‌: ఏపిలో రాష్ట్రంలో తిరుప‌తి ఉపఎన్నిక‌లో అధికారిపార్టీకి ఓటు అడిగే అర్హ‌త లేద‌ని టీడీపీ అధినేత నారాచంద్ర‌బాబునాయుడు విమ‌ర్శించారు. డ‌బ్బు తీసుకుని ఓట్లేస్తే హ‌క్కులు కోల్పోతార‌ని చెప్పారు. ఉప ఎన్నిక‌ప్ర‌చారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూర్‌, వెంక‌ట‌గిరిలో నిర్వ‌హించిన రోడ్ షోల్లో ఆయ‌న మాట్లాడారు. బెదిరించే వాలంటీర్ల‌ను ఎద‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు సూచించారు. తిరుప‌తి లోక్‌స‌భ ఉపఎన్నిక‌లో వైకాపా గెలిస్తే అక్ర‌మాల‌కు లైసెన్స్ ఇచ్చిన‌ట్లేన‌ని చెప్పారు.రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయాల‌ని…త‌మ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తార‌న్నారు. అప్పుడు దిల్లీ వెళ్లి పోరాటం చేయొచ్చ‌న్నారు. వైకాపా అధికారంలోకి రెండు సంవ‌త్సరాలు అవుత‌న్నా గ‌తంలో తాము చేసిన అభివృద్ధే క‌నిపిస్తోంద‌ని చెప్పారు. సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు వైకాపా ప్ర‌భుత్వం స్వస్తి ప‌లికింద‌ని.. కార్పొరేష‌న్ల‌ను నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు. టీడీపీ , వైకాపా పాల‌న‌పై చ‌ర్చ‌కు ధైర్య‌ముందా? అని చంద్ర‌బాబుస‌వాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *