ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రంలో మ‌రో 20 వేల‌కు పైగా కొత్త కేసులు..

అమ‌రావ‌తి:ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొవిడ్ క‌ర‌ళ‌నృత్యం చేస్తుంది. తాజాగా మ‌రో 20 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,15.784 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా..ఏపీరాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్ గా (17.3% పాజిటివిటీ) నిర్ధార‌ణ అయిన‌ట్టు ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌దర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. అలాగే ,82 మంది మృతి చెందిన‌ట్టు చెప్పారు. వైర‌స్ బారిన‌ప‌డి కోలుకుంటున్న‌వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌న్నారు. రాష్ట్రంలో తాజాగా 175 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించిన ఆయ‌న‌..ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించిన‌ట్టు చెప్పారు. రాష్ట్రంలోఆక్సిజ‌న్ సౌక‌ర్యం ఉన్న బెట్‌లు 21,850 ఉన్నాయ‌ని తెలిపారు.రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల కొర‌త లేద‌ని సృష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *