ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు భారీ జారీమాన …

అమ‌రావ‌తి: ప‌్రస్తుతం క‌రోనా విలాయ‌తాడవం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన తిరుప‌తిలోని సంకల్ప ఆసుప‌త్రి, శ్రీ ర‌మాదేవి మ‌ల్టీసూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి, పుత్తూరు సుభాషిణి ఆసుప‌త్రి, పీలేరు లోనిప్ర‌సాద్ ఆసుప‌త్రి ,మ‌ద‌న‌ప‌ల్లి లోని చంద్ర‌మోహ‌న్ న‌ర్సింగ్ హోమ్‌ల‌పై ల‌క్ష‌లాది రూపాయాలు ఫైన్లు విధించింది జిల్లాయంత్రాంగం.3 రోజుల్లో విధించిన రుసుం క‌ట్టాల‌ని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు భారీ జ‌రిమానా విధించింది.ఇప్ప‌టికే ఈ ఆసుప‌త్రుల యజ‌మాన్యం పై ఐపీసీ 188,406,420,53 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసారు. డ్ర‌గ్ ఆడిట్ లో బ‌య‌ట‌ప‌డ్డ రెమ్ డెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల అక్ర‌మ వినియోగం ,ఆసుప‌త్రుల్లో అనుమ‌తి లేకుండా బెడ్‌లు ఏర్పాటు చేసుకోవ‌డం, ఆరోగ్య‌శ్రీ బాధితుల నుండి అడ్వాన్సులు ప‌ట్టించుకుని వైద్యం చేయ‌డం, అధిక ధ‌ర‌ల‌కు సిటీ స్కాన్ లు నిర్వ‌హించ‌డం లాంటి అక్ర‌మాలు జ‌రిగాయ‌ని గుర్తించారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *