ప్ర‌తిప‌క్షాలు రాద్ధాంతం చేసిన ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాము- విద్యాశాఖ‌మంత్రి

అమ‌రావ‌తి: ఇప్పుడు ఎక్క‌డ చూసిన క‌రోనా క‌ర‌ళానృత్యం చేస్తున్న‌దని విష‌యం తెలిసిందే. ప్ర‌పంచాన్ని ఒణిస్తున్న కరోనామ‌హమ్మారి సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశంలో క‌రోనా పెట్రేగిపోతుంది. ఇలాంటి త‌రుణంలో దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాలు విద్యార్థుల ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కేంద్రం సీబీఎస్ ఈ 12 వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను కూడా రద్దు చేయ‌గా మ‌రోతెలుగు రాష్ట్రం తెలంగాణ‌లో స‌హా చాలా రాష్ట్రాలు టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దుచేసి అంద‌రూ పాసైన‌ట్లుగా ప్ర‌క‌టించారు. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ప్రసుత్తానికి టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌గా ఈ ప‌రీక్ష‌ల‌పై ప‌రీక్ష‌ల‌పై అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఏది ఏమైనాప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని ప్ర‌భుత్వం బ‌ల్ల‌గుద్ది చెప్తుంటే. పిల్ల‌ల‌తో పాటు త‌ల్లిదండ్రులు , టీచ‌ర్ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడేందుకు ప్ర‌భుత్వానికి హ‌క్కు ఎవ‌రిచ్చార‌ని ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా చేసే ప్ర‌స‌క్తే లేద‌ని ఏపీ విద్యాశాఖ‌మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేయ‌గా స్ప‌ష్టం చేయ‌గా ప్ర‌స్తుతం మ‌రోసారి కూడా అదే విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నేడు మీడియాతో ముచ్చ‌టిస్తూ ఆయ‌న క‌రోనావైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల‌ను వైర‌స్ ప్ర‌భావం కాస్త త‌గ్గ‌క‌ నిర్వ‌హిస్తామ‌ని అప్ప‌టి వ‌ర‌కు విద్యార్థులు స‌మాయ‌త్త‌మ‌వ్వాలని కోరారు. పరీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు మాత్ర‌మే కోరుతున్నార‌ని వెల్ల‌డించిన ఆయ‌న ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఎవ‌రూ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుకోవ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *