మ‌రో రెండు ల‌క్ష‌ల కోవిషీల్డ్ డోసులు…

అమ‌రావ‌తి: ఏపీరాష్ట్రంలో క‌రోనా రెండోవ సారి వేగంగా వ్యాప్తిస్తోన్న విష‌యం తెలిసిందే. కొవిడ్ విజృంభిన తీవ్రంగా పెరుగుతుండంతో మొద‌ట‌గా హెల్త్ కేర్ వ‌ర్క‌ర్స్‌కు అదేవిధంగా ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్‌కి వ్యాక్సిన్ వేసేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం స్పెష‌ల్ డ్రైవ్‌ను నిర్వ‌హించ‌నుంది. సీఎం వైఎస్‌. జ‌గన్ మోహ‌న్‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ఆ రాష్ట్ర కొవిడ్ ఆఫీస‌ర్ అర్జాశ్రీ‌కాంత్ తెలిపారు. శ‌నివారం అందిన ఆరు ల‌క్ష‌ల డోసుల‌తో పాటు ఆదివారం మ‌రో రెండు ల‌క్ష‌ల కోవిషీల్డ్ డోసులు ఏపీకి చేరుకున్నాయి. మిగిలిన ఫ్రంట్ లైన్‌, హైల్త్ కేర్ వ‌ర్క‌ర్ల‌కు కొవిడ్ టీకాలు వేసే డ్రైవ్‌ను చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొత్తం 10ల‌క్ష‌ల మంది వ‌ర్క‌ర్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు5 ల‌క్ష‌ల మందికి టీకాలు వేసిన‌ట్లు శ్రీ‌కాంత్‌
వెల్ల‌డించారు. ల‌బ్ధిదారుల‌కు టీకాలు వేసేలా చూసేందుకు వ్య‌క్తిగ‌త టీకా డేటాను ప‌ర్య‌వేక్షించే ఓ అప్లికేష‌న్‌ను అభివృద్ధి చేసిన‌ట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *