ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విలాయ‌తాడ‌వం చేస్తుంది…

అమరావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ సెంక‌డ్‌వేవ్ చాలా వేగం వ్యాప్తిచేందుతుంది. రోజురోజు పేట్రేగిపోతున్న మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల‌తోపాటు మ‌ర‌ణాలు కూడా పెర‌గుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో తాజాగా 18,561 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ రోజు న‌మోద‌యిన కేసుల‌తో క‌లిసి రాష్ట్రంలో 14,54,052 కి కొవిడ్ కేసులు చేరాయి. 24 గంట‌ల్లో కొవిడ్ తో 109 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొవిడ్‌తో 9,481 మంది మృతి చెందారు. ఇప్పుడు ఏపీలో 2,11,554 యాక్టివ్ కేసులున్నాయి. క‌రోనా నుండి కోలుకుని 12,33,017 మంది రిక‌వ‌రీ అయ్యారు. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 16మంది మృతి చెందారు. అనంత‌పురం ,చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 10మంది చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావ‌ర్ ,విశాఖ జిల్లాలో 9మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా, నెల్లూరు, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో 8 మంది, క‌ర్నూలు, శ్రీ‌కాకుళం జిల్లాల్లో ఏడుగురు ,ప్ర‌కాశం జిల్లా లో 4 , క‌డ‌ప జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *