మ‌త్స్య‌కార కుటుంబాల‌కు శుభ‌వార్త…

అమ‌రావ‌తి: రాష్ట్రంలో నెల‌కొన్న ఆర్థిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని సీఎం జ‌గ‌న్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి హామీలు అమ‌లు చేస్తున్నారు. క‌రోనా వ‌ల‌న ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు చెయూత స‌మక్షేమ ప‌థ‌కాలు ప‌థ‌కాలు ఆగిపోకుండా చూస్తున్నారు.విప‌త్క‌ర ప‌రిస్థితులలో లబ్ధిదారుల‌కు ఆర్థిక సాయం చేసి అండ‌గా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు సంక్ష‌మ ప‌థ‌కాలు అమ‌లు చేసి అబ్దిదారుల‌కు డ‌బ్బులు ఇచ్చిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కొత్త‌గా మ‌త్స్య‌కార కుటుంబాల‌కు శుభ‌వార్త చెప్పారు. వైఎస్ఆర్ మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కం కింద మ‌త్స్య‌కారుల‌కు వ‌రుస‌గా మూడో సంవ‌త్స‌రం రూ.10 వేల చొప్పున చేయూత‌నిచ్చేందుకు జ‌గ‌న్ స‌ర్కారు సిద్ధ‌మైంది. ఇందులో భాగంగా 1,19,875 కుటుంబాల‌కు ప్ర‌భుత్వం రూ.130.46 కోట్లు విడుద‌ల చేసింది. ఈ సంవ‌త్స‌రం మొత్తం 1,19,875 మందిని ,ఎస్టీలు 331 మంది ఉన్నారు. మంగ‌ళ‌వారం మే 18,2021) ల‌బ్దిదారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కానుంది. ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 14వ‌ర‌కు స‌ముద్రంలో వేట నిషేధించ‌డం వ‌ల్ల మ‌త్య్స‌కారులు ఉపాధి కోల్పోతున్నారు. దీంతో ఈ నిషేధ కాలానికి సంబంధించి ఒక్కో మ‌త్స్య‌కార కుటుంబానికి రూ. 10వేల చొప్పున వైఎస్ఆర్ మ‌త్య్స‌కార‌ భ‌రోసా కింద ప్ర‌భుత్వ డ‌బ్బులు ఇస్తోంది. మంగ‌ళ‌వారం ఒక్కో ల‌బ్దిదారుడి ఖాతాలో రూ.10 వేలు జ‌మ కానున్నాయి. వైఎస్ఆర్ మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కం చెల్లింపులను సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *