ఏపీలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు..

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజురోజుకి పెట్రేగిపోతున్న క‌రోనా మ‌హ‌మ్మారి. రాష్ట్రంలో ప్ర‌తి గంట‌కు స‌గ‌టున 1,007 మంది కొవిడ్ బారిన ప‌డుతుండ‌గా… న‌లుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్ర‌వ్యాప్తంగా 24,171 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది. 101 మంది మ‌ర‌ణించారు. ఒకేరోజు వంద‌కుపైగా మ‌ర‌ణాలు న‌మోదవ్వ‌టం ఈనెల‌లో ఇది రెండోసారి.శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌నుండి ఆదివారం ఉద‌యం 9గంట మ‌ధ్య రాష్ట్రవ్యాప్తంగా 94,550 న‌మూనాలు ప‌రీక్షించ‌గా అందులో 25.56 శాతం మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది. వ‌రుస‌గా రెండో రోజు కూడా 25 శాతానికి పైగా పాజివిటీ రేటు నమోదైంది. ఈనెల ఒక‌టో తేదీన 19,76శాతం ఉన్న పాజిటీవీటి రేటు క్ర‌మంగా పెరుగుతూ ఆదివారం నాటికి 25.56 శాతానికి చేరింది. ఒక రోజు వ్య‌వ‌ధిలో 24,171 కేసులు న‌మోద‌వ్వ‌టం కూడా తొలి, మ‌లిద‌శ‌లో ఇదే మొద‌టి సారి.రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491 కు, మ‌ర‌ణాలు9,372కు చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *