ఏపీరాష్ట్రానికి మ‌రో విప‌త్తు వ‌చ్చిప‌డింది……

ములిగేన‌క్క మీద తాడిపండు ప‌డిన‌ట్టుగా ఏపీ లో ఇప్ప‌టికే క‌రోనాతో స‌త‌మత‌మ‌వుతున్న ప్ర‌జ‌లు ఇలాంటి విప‌త్తులో మ‌రో గండం అంటే ప్ర‌జానీకం గ‌గ్గొలు ప‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో య‌స్ తుఫాను రావ‌ట‌మేరా దేవుడా అని వాపోతున్నారు. . క‌రోనా రోగుల‌కు ఎలాంటి ఇబ్బంద‌లు రాకుండా జ‌గ్ర‌త్త‌లు చేప‌ట్టాల‌ని కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కోరారు.క‌రోనా తో బాధ‌ప‌డుతున్న వారికి ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించాల్సిన అవ‌స‌రం ఉంటే వెంట‌నే చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాల‌ని తెలిపారు. ఏపీ రాష్ట్ర సీఎం స‌ర్కారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అమిషా అన్నారుతుపాను స‌న్న‌ద్ధ‌త‌పై ప్ర‌భావిత రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్పరెన్స్ నిర్వ‌హించారు. తుపానుతో ఉత్ప‌న్న‌మ‌య్యే ప‌రిస్థితులు,తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అవాంత‌రాలు లేకుండా చూడాల‌ని కోరారు.ఒడిశా ప్లాంట్ల నుండి ఆక్సిజ‌న్ ఇబ్బందులొస్తే ప్ర‌త్నామ్నాయం చూడాలి. విజ్ఞ‌ప్తి చేశారు. అవ‌స‌ర‌మైన సాంకేతిక సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. తుపాను క‌ద‌లిక‌ల‌ను ప‌రిశీలిస్తే స్వ‌ల్ప ప్ర‌భావం ఉండే అవ‌కాశ‌ముంద‌ని.. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుని ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు. ఈ సంగ‌తిలో ప్ర‌భుత్వ‌యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని అమిత్‌షాకు జ‌గ‌న్ తెలిపారు. తుపాను సన్న‌ద్ధ‌త‌పై సీఎంజ‌గ‌న్ స‌మావేశం అవిత్‌షాతో స‌మావేశం అనంత‌రం ఉన్న‌తాధికారుల‌తో సీఎం జ‌గ‌న్ స‌మావేశ‌మయ్యారు.తుపాన్ సంద‌ర్భంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌లు పై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. క‌రోనా రోగుల‌కు ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *