గ‌డిచిన 24గంట‌ల్లో 12,768 క‌రోనా కేసులు….

అమ‌రావ‌తి: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ‌నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ప్ర‌స్తుతం ఏపీ రాష్ట్రంలో గ‌డిచిన 24గంట‌ల్లో తాజాగా 12,768 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం న‌మోద‌యిన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో 17,17,156 కు కొవిడ్ కేసులు చేరాయి. 24 గంట‌ల్లో క‌రోనాతో 98 మంది మృతి చెందారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతోరాష్ట్ర‌వ్యాప్తంగా 11,132 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఏపీలోఇప్పుడు 1,43,795 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు కొవిడ్ నుండి 15,62,229 మంది రిక‌వ‌రీ అయ్యారు.24 గంట‌ల్లో 15,612 మంది రిక‌వ‌రీ అయ్యారు. ఏపీలో 24గంట‌ల్లో 98,048 టెస్టుల నిర్వ‌హించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో15, నెల్లూరు జిల్లాలో 10మంది మృతి చెందారు. ప‌శ్చిగోదావ‌రి జిల్లాలో 9మంది మృతి, అనంత‌పురం, తూర్పుగోదావ‌రి , విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో8మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు, ప్ర‌కాశం, శ్రీ‌కాకుళం జిల్లాల్లోఏడుగురు చొప్పున మృతి చెందారు. విశాఖ జిల్లాలో 6,కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో న‌లుగురు చొప్పున మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *