ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై క‌రోనా పంజా …..ఎనిమిది వారాలు లాక్‌డౌన్

అమ‌రావ‌తి: నిత్యం క‌రోనా వైర‌స్ తో పోరాటం చేస్తున్నాం, భార‌త‌దేశం మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు నాలుగు ల‌క్ష‌ల‌కుపైగా న‌మోద‌వుతుండ‌గా.. ఆంధ్ర‌ప్ర‌దేశంలో రాష్ట్రంలో క‌రోనా క‌ర‌ళానృత్యం ఎక్కువ‌గా చేస్తుంది.ఇక్క‌డ ప్ర‌తి రోజు 20 వేల‌కు తాజా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో పాక్షిక‌లాక్‌డౌన్ అమ‌లు చేస్తుండా కేసులు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఉద‌యం 6నుంచి 12గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల అనుమ‌తి ఉండ‌డంతో ఈ స‌మ‌యంలో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 20శాతం మించిపోయింది. ప‌దిశాతం మించ‌ని రాష్ట్రాల‌లో కూడా సంపూర్ణ‌ లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా ఏపీ ఇప్ప‌టి వ‌ర‌కు క‌ఠిన ఆంక్ష‌ల‌తోనే క‌రోనా క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ.. పాజిటివ్ కేసులు మాత్రం నిత్యం ఇర‌వై వేల‌కు పైగానే న‌మోద‌వుతున్నాయి. మ‌రోవైపు రెండు ల‌క్ష‌ల మందికి పైగా యాక్టివ్ కేసులు ఉంటున్నాయి. కాగా, రేప‌టితో ఇప్పుడు అమ‌లవుతున్న ప‌గ‌లు 12 గంట‌ల నుండి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6గంట‌ల వ‌ర‌కు క‌ర్ప్యూ ముగియ‌నుంది. దీంతోరాష్ట్రంలో త‌దుప‌రి క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం స‌మాలోచ‌న చేస్తుంది. ఇప్ప‌టికే ఐసీఎంఆర్ ఆరు నుంచి ఎనిమిది వారాలు లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని సూచించ‌గా రాష్ట్ర వైద్యాధికారులు కూడా అదే భావ‌న‌లో ఉన్నారు. త‌దుప‌రి లాక్‌డౌన్ అమ‌లు జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు స‌మీక్షా స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోనున్నారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డ‌మా..లేక ఇప్పుడున్న క‌ర్ప్యూ స‌డ‌లింపు స‌మ‌యాన్ని మ‌రింత కుదించ‌డ‌మా అన్న‌ది నిర్ణ‌యించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *